ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6


3.1 పరీక్షిత్తు రాజభవనం

- మంత్రి కూర్చొని యుండును.
- పరీక్షిత్తు సింహాసనం మీద నుండి దిగి ఆవేశంతో అటూ ఇటూ కొద్ది క్షణాలపాటు నడిచి, మరల సింహాసనము మీద కూర్చొనును.

మంత్రి:
పరీక్షిన్మహరాజా! కలియుగము గురించి మీకింతటి మనో వ్యాకులము అనవసరమని నా అభిప్రాయము. మీరు మీ తాతగారైన ధర్మరాజు కంటే ఎక్కువగా దానధర్మాలను చేశారు. ఇప్పటికే మూడు అశ్వమేథ యాగాలు కూడా పూర్తిగావించారు. ఇంత ధర్మబద్ధముగా సాగుతున్న మీ పరిపాలనలో ఎటువంటి అధర్మమునకు తావు కలుగదని నేనంటాను. మరి నాకు సెలవిప్పిస్తే... [కొద్దిగా లేవబోయి ఒక భటుని రాకతో మరల కూర్చొనును]

భటుడు 1: [అప్పుడే ప్రవేశించి] పరీక్షిన్మహారాజుకు జయీభవ, దిగ్విజయీ భవ!
భటుడు 1:
మహారాజా! పశ్చిమ దిశగా రాజ్యవిస్తరణ కొరకై దండయాత్రను ప్రకటించిన దిక్భూపతి, దండయాత్రను చాలించి, మీ సాన్నిహిత్యం కొఱకు దూతలను పంపనున్నారు. [పరీక్షిత్తు తల ఊపును, భటుడు వెడలిపోవును.]

మంత్రి:
చూశారా! నామాటలు అక్షరాలా నిజం. శత్రువులు కూడా మీ ధర్మ పరిపాలనను గుర్తించారంటే, ఇక కలి యుగము గురించి మీకనవసరం. నిశ్చింతగా మీరు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి. కొంచెం ఎండలు మెండుగా ఉన్నా, మానసోల్లాసమునకు వేటకు బయలుదేరండి. నామాటలు నమ్మండి. ఇక నాకు సెలవిప్పిస్తే... [కొద్దిగా లేవబోయి ఇంకొక భటుని రాకతో మరల కూర్చొనును.]

భటుడు 2:
[అప్పుడే ప్రవేశించి] మహారాజా! నర్తకీమణి నాట్య ప్రదర్శన చేయుటకు తమ ఆదేశము కొఱకు వేచియున్నారు. [పరీక్షిత్తు రమ్మని చేసైగ చేయును, భటుడు వెడలిపోవును.]

మంత్రి: అయ్యా! ఈ నాట్యమయ్యాక సెలవు తీసుకొంటాను, అనుమతివ్వండి.
నర్తకి:
[ప్రవేశించి, రాజుకు నమస్కరించి, ఒక పాటకు నాట్యము చేయును.]
[అనుగుణమైన కొన్ని పాటలు:
- "భక్త పోతన" (1947) చిత్రమునుండి పాట: మంచి సమయము రారా
- స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి... [https://youtu.be/Fuc5V9ZdziU]
- మరులు కొన్నానే - బాలమురళికృష్ణ [https://youtu.be/YngEf8DlXf4]
- మరులు మించేరా సఖా నిన్ను విడనాడలేరా (బాలమురలికృష్ణ) [https://youtu.be/2ToRU47nq-g]

నర్తకి: [నాట్యము అనంతరం, రాజునకు నమస్కరించును.]

పరీక్షిత్తు: [బహుమతినిమ్మని ఒక భటుని చే సైగ చేయును]

భటుడు 2: [ప్రవేశించి ఒక పండ్ల పళ్ళెమును నర్తకికిచ్చును, నర్తకి, భటుడు వెడలిపోవును.]

మంత్రి: రాజా! నాకిక సెలవిప్పించండి. మరల రేపు కలిసెదను.

పరీక్షిత్తు: [సరేనని తల ఊపును, మంత్రి వెడలిపోవును.]


పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
Joined conference / Posted practice audio? (L) for Live
Name 1/21 1/23 1/24 1/27 1/28 1/30 1/31 2/1(L) 2/3 2/4 2/6(L) 2/7(L)
pOtana Y Y Y Y Y Y
SishyuDu-1 Y Y Y Y Y Y Y Y Y Y Y
SishyuDu-2 Y Y Y Y Y Y Y Y Y Y Y
nAraduDu Y Y
vyAsuDu Y Y Y Y Y Y Y Y
parIkshit Y Y Y Y Y Y Y
maMtri Y Y Y Y Y
bhaTuDu-1 Y Y
pUjAri-1 Y Y Y Y Y Y Y
bhaTuDu-2 Y Y Y
pUjAri-2 Y Y Y Y Y Y Y
muni Y Y
nartaki Y Y Y Y Y
kalipurushuDu Y Y Y Y Y Y
SamIkuDu Y Y Y Y
SRMgi Y Y Y Y Y Y Y
gauruDu Y Y Y Y Y
janamEjayuDu Y Y Y Y Y Y Y
SukuDu Y Y Y Y Y