ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6


2.1 నారదుడు వ్యాసునకు భాగవతమును వ్రాయమని చెప్పుట [సరస్వతి నదీతీరము]

వ్యాసుడు: [వ్యాకుల చిత్తుడై కూర్చుని యుండును]

నారదుడు: [ప్రవేశించును]
నారాయణ, నారాయణ! వ్యాసా! ఎందుకు నీవిలా చించించు చున్నావు?

వ్యాసుడు:
[నిలబడి] ప్రణామములు గురువర్యా! మీరెరుగనిదేమి? వేదములను విభజించి మానవునికి తగిన కర్మ ధర్మములను బోధించితిని. అయినను నామనస్సెందుకో వ్యాకులత గొనియున్నది.

నారదుడు:
వ్యాసా! ఎన్ని ధర్మములను నీవు బోధించినను, జుగుప్సితములైన కామ్య కర్మలే ధ్యేయముగా మానవులు జీవింతురు.
అదిగో అటు చూడుము. కలియోగములోని మానవుల కష్టములను నీకు చక్కగా బోధపడును.

******** ఇచ్చట భాగము 2.2 పూర్తిగా నడచును ********

చూచితివా వ్యాసా! కోరికలు లేకుండగా ఎవ్వరు పనిచేయుటలేదు. చివరికి దేవుని సన్నిధిలోనూ కోరికలతో అంధులగుచున్నారు. కనుక నీవు భగవంతుని లీలలను వర్ణించుచూ, కామ్యకర్మములను విడనాడే మార్గమును చూపుతూ ఒక గ్రంథమును వ్రాయుము.

ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరి స్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు గుణా నురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగఁ జెప్పవే


ఇంకా వినుము. ఈ సంసారమనే సాగరములో భక్తి ఒక నావలాంటిది.

విను మీ సంసారం బను
వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
దనఁ బొందెడు వానికి వి
ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా!



వ్యాసుడు: మీ ఆనతి గురువర్యా! [నమస్కరించును]

నారదుడు: నారాయణ, నారాయణ! [వెడలిపోవును]

వ్యాసుడు: జీవుడు మాయచేత మోహితుడవునుకదా!
జీవుండు మాయచేత మోహితుండయి గుణవ్యతిరిక్తుండయ్యు
మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచు
ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు[ననియు];
నయ్యనర్థంబునకు నారాయణభక్తి యోగంబు గాని యుపశమనంబు వేఱొకటిలేదు.




******** నేరుగా భాగము 3.1 కి వెళ్ళుము ********

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
Joined conference / Posted practice audio? (L) for Live
Name 1/21 1/23 1/24 1/27 1/28 1/30 1/31 2/1(L) 2/3 2/4 2/6(L) 2/7(L)
pOtana Y Y Y Y Y Y
SishyuDu-1 Y Y Y Y Y Y Y Y Y Y Y
SishyuDu-2 Y Y Y Y Y Y Y Y Y Y Y
nAraduDu Y Y
vyAsuDu Y Y Y Y Y Y Y Y
parIkshit Y Y Y Y Y Y Y
maMtri Y Y Y Y Y
bhaTuDu-1 Y Y
pUjAri-1 Y Y Y Y Y Y Y
bhaTuDu-2 Y Y Y
pUjAri-2 Y Y Y Y Y Y Y
muni Y Y
nartaki Y Y Y Y Y
kalipurushuDu Y Y Y Y Y Y
SamIkuDu Y Y Y Y
SRMgi Y Y Y Y Y Y Y
gauruDu Y Y Y Y Y
janamEjayuDu Y Y Y Y Y Y Y
SukuDu Y Y Y Y Y