ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6


1.2. పోతన గారి శిష్యులు భాగవత పద్యములను అభినందించుట

శిష్యులారా, నేను కొంచెం సేపు దేవాలయమునకు వెళ్ళి వచ్చెదను.
ఈ భాగవతానువాదమునగల కొన్ని పద్యములను చదువుకొనుము.
[పోతనగారు వెడలి పోవును.]

శిష్యుడు-1: అలాగే గురువర్యా!

శిష్యుడు-2: అలాగే గురువర్యా!

శిష్యుడు-1: సిద్ధా! ఇట్టి భక్తి కావ్యము నభూతో నభవిష్యతి. ఇందలి కొన్ని పద్యములను చదివెదమా?

శిష్యుడు-2:
అలాగే! ఇందులో మానవునికి కావలసిన తత్వజ్ఞానమంతయు గలదు. ఇది సకల పురాణ రాజము. వేదేతిహాసముల సారమెల్లయు దాగియున్నది.

శిష్యుడు-1: అంతే కాదు, ఇందులో ప్రహ్లాద చరిత్రము, గజేంద్ర మోక్షము వంటి గొప్ప కథలు కూడా ఉన్నాయి.

శిష్యుడు-2: ప్రహ్లాద చరిత్రమున గల ఈ పద్యమును వినుము:
కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచుచూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి

దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి



శిష్యుడు-1:
ఇందుగలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే!



శిష్యుడు-2:
గజేంద్రమోక్షమున ఏనుగుకు మొసలి కి జరిగే పోరాటమును వినుము:
కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గర కరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భరమనుచును నతల కుతల భటులరుదుపడన్.



శిష్యుడు-1:
వామన చరిత్రనుండి ఈ మధురమైన పద్యమును చూడుము:
ఇంతింతై, వటుడింతయై, మఱియుఁదానింతై, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమునకల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.



శిష్యుడు-1: ఈ భాగవతాన్ని గురువుగారు శ్రీరామచంద్రునికే అంకితమిచ్చారు తెలుసా!

శిష్యుడు-2:
మరి నారదులు వ్యాసభగవానునికి చెప్పిన రహస్యాలన్నీ దీనిలో ఉన్నాయి. అంతటి మహా గ్రంథాన్ని, అంతటి పవిత్ర గ్రంథాన్ని మనుజేశ్వరాధములకివ్వజాలనని గురువుగారు చెప్పారు.

శిష్యుడు-1: ఆహా!
శిష్యుడు-2: ఏమిటి గంగనా?

శిష్యుడు-1: భగవంతుని తొమ్మిది రకాలైన భక్తి మార్గములలో కొలువవచ్చునట!
శిష్యుడు-2: ఏమిటా తొమ్మిది?

శిష్యుడు-1: ప్రహ్లాదుడు తన తండ్రిగారైన హిరణ్యకశిపునకు ఇట్లు చెప్పెను:
తనుహృత్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలఁతున్ సత్యంబు దైత్యోత్తమా


శిష్యుడు-2: ఎంత జ్ఞానోదయము గల పద్యము! మరి ఇందాక భగవంతుని పూజించే చేతులే చేతులు అని పొగిడారు కదా గురువుగారు?

శిష్యుడు-1: అవును!
శిష్యుడు-2: ఈ పద్యంలో భగవంతుని పూజించనటువంటి చేయి - అది చేయి కాదు, చెట్టుకొమ్మతో చేసిన తెడ్డు అంటారు.

శిస్యుడు-1: ఏదీ వినిపించు.
శిష్యుడు-2: దీనిని ప్రహ్లాదునిచే పలికించారు పోతనగారు:
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక

చక్రి చింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే
పాదయుగముతోడి పశువు గాక



శిష్యుడు-2: గురువుగారు దేవాలయానికి వెళ్ళారు కదా, మనం కూడా వెళ్ళొద్దాం పద.
శిష్యుడు-1: సరే పద.
[ఇద్దరూ నిష్క్రమించెదరు]


పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
Joined conference / Posted practice audio? (L) for Live
Name 1/21 1/23 1/24 1/27 1/28 1/30 1/31 2/1(L) 2/3 2/4 2/6(L) 2/7(L)
pOtana Y Y Y Y Y Y
SishyuDu-1 Y Y Y Y Y Y Y Y Y Y Y
SishyuDu-2 Y Y Y Y Y Y Y Y Y Y Y
nAraduDu Y Y
vyAsuDu Y Y Y Y Y Y Y Y
parIkshit Y Y Y Y Y Y Y
maMtri Y Y Y Y Y
bhaTuDu-1 Y Y
pUjAri-1 Y Y Y Y Y Y Y
bhaTuDu-2 Y Y Y
pUjAri-2 Y Y Y Y Y Y Y
muni Y Y
nartaki Y Y Y Y Y
kalipurushuDu Y Y Y Y Y Y
SamIkuDu Y Y Y Y
SRMgi Y Y Y Y Y Y Y
gauruDu Y Y Y Y Y
janamEjayuDu Y Y Y Y Y Y Y
SukuDu Y Y Y Y Y